ప్రభుదేవా చాలా స్పీడ్.. ఈ ఏడాదిలో రెండు !

ప్రభుదేవా చాలా స్పీడ్.. ఈ ఏడాదిలో రెండు !

Published on Jan 1, 2021 9:59 PM IST

Prabhu Deva
కొరియోగ్రాఫర్ నుండి నటుడిగా, నటుడు నుండి దర్శకుడిగా మారారు ప్రభుదేవా. ప్రతి దశలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఒకవైపు దర్శకుడిగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే నటుడిగా వరుస సినిమాలకు సైన్ చేస్తున్నారు. ఈ 2021లో ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన ‘రాధే’ చిత్రం రిలీజ్ కానుంది. ఇందులో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. ఈద్ సందర్బంగా చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రంపై బాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే సినిమా 230 కోట్ల బిజినెస్ చేసినట్టు సమాచారం.

ఇక నటుడిగా ఆయన రెండు కొత్త చిత్రాలకు సైన్ చేశారు. వాటిలో ఒకటి మంజాపై రాఘవన్ దర్శకత్వంలో ఉండనుండగా ఇంకొకటి మణిరత్నం అసిస్టెంట్ శ్రీరామ్ డైరెక్షన్లో రెండవది ఉండనుంది. ఈ రెండూ ఈ ఏడాదిలోనే మొదలై ఈ ఏడాదిలోనే విడుదలకానున్నాయి. ఈ రెండూ కాకుండా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా చేస్తున్న ‘విక్రమ్’ చిత్రంలో కూడ ప్రభుదేవా ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఇలా నటుడిగా, దర్శకుడిగా ప్రభుదేవా పూర్తిస్థాయిలో అలరించనున్నారన్నమాట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు