స్టార్ యాంకర్ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లలో నిజమెంత…?

Published on Nov 8, 2019 8:20 pm IST

బుల్లి తెరపై నంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతున్నారు ప్రదీప్ మాచిరాజు. గత కొన్ని రోజులుగా రెగ్యులర్ గా చేసే టీవీ షోలలో కానీ, బహిరంగ ప్రదేశాలలో కానీ ఆయన కనిపించలేదు. దీనితో ఆయన ఆరోగ్యపరిస్థితి బాగోకపోవడం వలెనే ఆయన టీవీ షోలకు దూరమయ్యారంటూ కొద్దిరోజులుగా అనేక కథనాలు వెలువడ్డాయి. ప్రదీప్ అభిమానులు ఈ వార్తలతో కంగు తిన్నారు. కాగా ఆయన తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారంటూ వచ్చిన వార్తపై ప్రదీప్ స్పందించారు. ఓ వీడియో సందేశం ద్వారా ప్రదీప్ ఈ పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.

నాకు ఎటువంటి అనారోగ్య సమస్యలేదు, కాలికి గాయమైన కారణంగా డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పడంతో ప్రోగ్రాంలలో పాల్గొనడం లేదని, త్వరలోనే యథావిధిగా అన్ని కార్యక్రమాలలో పాల్గొంటాను, అని ఓ వీడియో ద్వారా తెలియజేశారు. దీనితో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కొంచెం టచ్ లో ఉంటే చెబుతా, ఢీ జోడి, ఎక్స్ ప్రెస్ రాజా వంటి పలు కార్యక్రమాలకు ప్రదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :