మానవత్వం చాటుకున్న క‌న్నడ స్టార్ హీరో..!

Published on Jul 3, 2021 11:16 pm IST


కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటుడిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడో మానవత్వం ఉన్న మనిషిగా కూడా అంతే గొప్ప పేరు తెచ్చుకుంటున్నాడు. అయితే తాజాగా ఓ వృద్ధ దంపతులకు ఆసరాగా నిలిచిన సుదీప్ వారి బాగోగులు కూడా చూసుకుంటూ అందరి చేత మరోసారి రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. కర్ణాటకలోని దొడ్డ ప‌ట్ట‌ణంలో నివ‌సిస్తున్న శ్రీనివాస్‌, కమలమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

అయితే ఇద్దరు కుమారుల్లో ఒక కుమారుడు తల్లి దండ్రుల‌ని వ‌దిలేసి మైసూర్‌లో స్థిర‌ప‌డగా, మరో కుమారుడు దివ్యాంగుడు. అయితే బెంగ‌ళూరులో ఆ వృద్ధ దంపతులకు ఉన్న ఆస్థుల‌న్ని అమ్ముకుని దొడ్డ ప‌ట్ట‌ణంకి వ‌చ్చి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే కొద్ది రోజులుగా క‌మల‌మ్మ అనారోగ్యంతో బాధ‌ప‌డుతుండగా, విషయం తెలుసుకున్న సుదీప్ ఆమెకు బెంగ‌ళూరులోని జైన్ ఆసుప‌త్రిలో చికిత్స చేపిస్తూ వారి బాగోగులు చూసుకుంటున్నారు. దీంతో సుదీప్‌పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు.

సంబంధిత సమాచారం :