ఎన్టీఆర్ సినిమాలో దర్శకేంద్రుడి డైరెక్షన్ !

ఎన్టీఆర్ సినిమాలో దర్శకేంద్రుడి డైరెక్షన్ !

Published on Dec 15, 2018 9:06 AM IST

ప్రముఖ దర్శకుడు మరియు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ మొదట హీరోగానే సినీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆయన సినిమాలకి చాలా సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి.. మళ్లీ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. కాగా క్రిష్ దర్శకత్వంలో బాలయ్య నిర్మాణంలో మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కతున్న బయోపిక్ పార్ట్స్ లో తన తండ్రి లెంజెండరీ దర్శకుడు రాఘవేంద్రరావు పాత్రలో ప్రకాష్ కనిపించబోతున్న విషయం తెలిసిందే. బాలయ్య మరియు ప్రకాష్ పై చిత్రబృందం ఇప్పటికే కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించింది. ఆ సన్నివేశాల్లో ముఖ్యంగా రాఘవేంద్రరావు ఎన్టీఆర్ ని ఎలా డైరెక్ట్ చేశాడు, ఆ రోజుల్లో షూటింగ్ ని ఎంత నిబద్దతతో చేసేవారో లాంటి అంశాలను షూట్ చేసినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ కి, రాఘవేంద్రరావు మధ్య చక్కటి అనుబంధం ఉంది. వీరిద్దరి కలయికలో ‘వేటగాడు, డ్రైవర్ రాముడు, అడవి రాముడు’ లాంటి పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. ఆ చిత్రాల షూటింగ్ కి సంబంధించిన సంఘటనలను బయోపిక్ లో చూపించనున్నారు.

ఇక కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను జనవరి 9న విడుదల చేసి, జనవరి 24న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు