ప్రకాష్ రాజ్ హిందీ ‘ఉలవచారుబిర్యాని’ ఎవ్వరికీ రుచించడం లేదు.

Published on Jun 8, 2019 5:05 pm IST

మలయాళంలో రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చిన “సాల్ట్ అండ్ పెప్పర్” మూవీ సూపర్ హిట్ కావడంతో ఆ మూవీ పట్ల ఆకర్షితుడైన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తెలుగు,కన్నడ,తమిళ బాషలలో నటించి దర్శకత్వం వహించారు. సౌత్ ఇండియా మొత్తం అన్ని భాషలలో ఈ మూవీ మంచి ఫలితాన్నే ఇచ్చింది. ఆ స్పూర్తితో ప్రకాష్ రాజ్ హిందీలో కూడా ఈ మూవీని ‘తడ్కా’ అనే టైటిల్ తో తెరకెక్కించారు. ఈ మూవీలో ప్రముఖ నటుడు నానా పాటేకర్,శ్రీయా శరణ్,తాప్సి,అలీ ఫజల్ ప్రధాన పాత్రలలో నటించారు. ఎప్పుడో షూటింగ్ మొదలు పెట్టిన ప్రకాష్ రాజ్ గత సంవత్సరం లోనే చిత్రీకరణ మొత్తం పూర్తి చేశాడు. కారణం ఏమిటో తెలియదు కానీ, ఈ మూవీ విడుదల గురించి చిత్ర యూనిట్ ఇంత వరకు ఎటువంటి ప్రకటన చేసింది లేదు.

తాజాగాఈ మూవీ గురించి వస్తున్న వార్తేమిటంటే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు ,తడ్కా’ మూవీ పై ఆసక్తి చూపడం లేదంట. దానితో ఈ మూవీని కొని రిలీజ్ చేసేవారు లేకుండా పోయారట. దానితో చేసేదేమిలేక ఈ మూవీని డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్, అమెజాన్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకొని విడుదల చేయాలని భావిస్తున్నారట.ప్రకాష్ రాజ్ ఈ మధ్య తన ఫోకస్ ని రాజకీయాలపై పెట్టారు. గత సార్వత్రిక ఎన్నికలలో బెంగుళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీచేసిన ఆయన ఓటమిపాలైయ్యారు.

సంబంధిత సమాచారం :

More