‘ఉలవచారు బిర్యాని’ టైటిల్ ని ఆ దర్శకుడు పెట్టమన్నాడు

‘ఉలవచారు బిర్యాని’ టైటిల్ ని ఆ దర్శకుడు పెట్టమన్నాడు

Published on May 29, 2014 7:04 PM IST

ulavacharu-biryani
ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వం నిర్మిస్తున్న సినిమా ‘ఉలవచారు బిర్యాని’. ఈ సినిమా ఒకేసారి మూడు భాషలలో తెరకెక్కుతుంది. ఇటివల ఒక ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, ఈ సినిమాకు ‘ఉలవచారు బిర్యాని’ అనే టైటిల్ పెట్టమని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ చెప్పాడని తెలిపాడు.

ఈ సినిమా గురించి ఇంకా మాట్లాడుతూ, ఈ సినిమా అనుకోని ట్విస్ట్ లతో ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో ఉంటుందని అన్నారు. తన దర్శకత్వం గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, తనకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టమని, చాలా పుస్తకాలు చదువుతానని, అప్పుడప్పుడు స్క్రిప్ట్స్ రాసుకుంటానని తెలిపాడు. భవిష్యత్తులో మరిన్ని సినిమాలకు దర్శకత్వం వహిస్తానని అయన అన్నారు. ఇంకో విశేషం ఏంటంటే ప్రకాష్ రాజ్ భార్య పోనీ వెర్మ కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా మరియు కొరియోగ్రాఫర్ గా పనిచేసింది. తన భార్యకు కూడా డైరెక్షన్ అంటే ఇష్టం అని ప్రకాష్ రాజ్ తెలిపాడు.

ప్రస్తుతం ఎన్నో వివాదాలలో చిక్కుకుంటున్న ప్రకాష్ రాజ్ కి ఈ సినిమాతో మంచి సక్సెస్ రావాలని కోరుకుందాం.

తాజా వార్తలు