22 ఏళ్ల తర్వాత మరోసారి అదే పాత్రను చేయనున్న ప్రకాశ్ రాజ్ ?

Published on Oct 10, 2019 12:53 pm IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎంజీఆర్, కరుణానిధి పాత్రలు కూడా ఉన్నాయి. వీటిలో ఎంజీఆర్ పాత్రను అరవిందస్వామి చేయనుండగా కరుణానిధి పాత్రను ప్రకాశ్ రాజ్ చేయనున్నాడనే టాక్ వినబడుతోంది.

గతంలో కూడా ప్రకాశ్ రాజ్ కరుణానిధి పాత్రలో నటించారు. 1997లో మణిరత్నం రూపొందించిన ‘ఇరువర్’ చిత్రంలో కరుణానిధి పాత్రను పోషించారు. అప్పట్లో ఆ పాత్రకు, అందులో ప్రకాశ్ రాజ్ నటనకు ఎన్నో ప్రసంశలు అందాయి. మళ్లీ 22 ఏళ్ల తర్వాత అదే పాత్రలో నటిస్తున్నారాయన. జయలలిత రాజకీయ జీవితం వరకు కరుణానిధిది నెగెటివ్ పాత్రలానే కనిపిస్తుంది. మరి సినిమాలో ఎలా చూపుతారో చూడాలి.

ఇకపోతే ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ‘తలైవి’గా వస్తున్న ఈ చిత్రం హిందీలో ‘జయ’ పేరుతో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

X
More