దర్శకేంద్రుడి పాత్రలో ‘దర్శకేంద్రుడి కుమారుడు’ !

Published on Dec 8, 2018 12:11 pm IST

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ మొదట హీరోగానే సినీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయితే ఆ తరువాత ఆయన సినిమాలకి చాలా సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి.. మళ్లీ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. కాగా తాజాగా సినీ వర్గాల సంవహరం ప్రకారం ప్రకాష్ మళ్లీ నటించనున్నారు.

క్రిష్ దర్శకత్వంలో బాలయ్య నిర్మాణంలో మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కతున్న బయోపిక్ పార్ట్స్ లో తన తండ్రి లెంజెండరీ దర్శకుడు రాఘవేంద్రరావు పాత్రలో ప్రకాష్ కనిపించబోతున్నారు.

ఎన్టీఆర్ కి, రాఘవేంద్రరావు మధ్య చక్కటి అనుబంధం ఉంది. వీరిద్దరి కలయికలో ‘వేటగాడు, డ్రైవర్ రాముడు, అడవి రాముడు’ లాంటి పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. ఆ చిత్రాల షూటింగ్ కి సంబంధించిన సంఘటనలను బయోపిక్ లో చూపించనున్నారు.

ఇక కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను జనవరి 9న విడుదల చేసి, జనవరి 24న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :