
ఈ మధ్య కాలంలో హీరోయిన్ అంటే ఒక గ్లామర్ మెటీరియల్ అనే చెప్పుకోవాలి. ప్రస్తుత హీరోయిన్స్ కి ఎక్కువ నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రలు, రిస్క్ తో కూడుకున్న పాత్రలు చెయ్యడం చాలా అరుదుగా వస్తున్నాయి. ఇప్పడు అలాంటి అరుదైన పాత్రని దక్కించుకుంది అందాల భామ ప్రణిత. కన్నడ బ్యూటీ ప్రణిత హీరోయిన్ గా టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు హీరోగా నటించిన సినిమా ‘డైనమైట్’.యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో మంచు విష్ణు హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఆకట్టుకోనున్నాడు. కేవలం మంచు విష్ణునే కాకుండా ప్రణిత కూడా రియల్ స్టంట్స్ చేసి ప్రేక్షకులను థ్రిల్ చేయనుంది.
ఈ రియల్ స్టంట్స్ పై ప్రణిత స్పందిస్తూ ‘నేను రోజు సెట్లోకి అడుగు పెట్టే సమయానికి విష్ణు కొన్ని స్టంట్స్ రిహార్సల్స్ చేస్తూ కనిపిస్తారు. తను చేసిన స్టంట్స్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసాయి. తనకి ఈక్వల్ గా నేను స్టంట్స్ అండ్ పెర్ఫార్మన్స్ చేయాలనుకున్నాను. అందుకే డూప్ లేకుండా స్టంట్స్ పై ట్రైనింగ్ తీసుకొని సినిమాలో నేనే ఓన్ గా చేసాను. బాగా ఎంజాయ్ చేస్తూ చేసాను, కచ్చితంగా ఆడియన్స్ ని థ్రిల్ చేసేలా ఉంటుందని’ తెలిపింది. బాగా ఇంటెన్స్ ఉన్న సినిమాలు తీసే డైరెక్టర్ దేవకట్టా దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ఈ నెల 28 నుంచి ఈ చిత్ర టీం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆంధ్ర, రాయలసీమలలో ప్రమోషనల్ టూర్ మొదలు పెట్టనున్నారు.

