ప్రభాస్ “సలార్” పై మరింత క్లారిటీ ఇచ్చిన నీల్..?

Published on Jan 22, 2021 7:03 am IST

ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా “కేజీయఫ్ చాప్టర్ 2” కోసం అంతా ఎంతలా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. మరి అలాంటి ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను దర్శకత్వం వహించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ మరియు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ల కాంబో అనౌన్స్ చేసిన మరో బిగ్గెస్ట్ యాక్షన్ అండ్ పాన్ ఇండియన్ చిత్రం “సలార్”. ఇప్పుడు దీని మీద కూడా కనీ వినీ ఎరుగని రేంజ్ అంచనాలు ఉన్నాయి.

దీనితో పాటుగా కొన్ని రోజుల నుంచి పలు ఆసక్తికర అంశాలే వినిపిస్తుండగా లేటెస్ట్ గా నీల్ మరో క్లారిటీ ఇచ్చినట్లుగా టాక్ ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ఎలాంటి సినిమాకు కూడా సీక్వెల్ కానీ రీమేక్ కాదని పూర్తిగా ఒక స్ట్రెయిట్ అండ్ కొత్త స్టోరీ అని అంటున్నారు. సో ఈ విషయంలో క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి. ఇక ఈ సాలిడ్ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా మేకర్స్ శరవేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారు.

సంబంధిత సమాచారం :

More