“సలార్” పై సస్పెన్స్ కు లాంగ్ టైం నే పెట్టిన ప్రశాంత్ నీల్.!

Published on Dec 4, 2020 3:03 pm IST

లేటెస్ట్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వచ్చిన సెన్సేషనల్ అనౌన్స్మెంట్ “సలార్”. కేజీయఫ్ తో పాన్ ఇండియన్ దర్శకునిగా మారిన దర్శకుడు అంతే స్థాయి హీరో అయినటువంటి ప్రభాస్ తో “సలార్” అనే భారీ యాక్షన్ థ్రిల్లర్ ను అనౌన్స్ చేయడంతోనే ఒక్కసారిగా ఎనలేని హైప్ ను తెచ్చుకున్నారు.

అయితే ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ సినిమాగా ప్రకటించారు కానీ ఓ అంశాన్ని మాత్రం సస్పెన్స్ గా ఉంచేశారు. దానిని కాస్తా ప్రశాంత్ నీల్ ఏకంగా సినిమా విడుదల దగ్గర పడే సమయంలోనే రివీల్ చేస్తానని తెలిపారట. ఇంతకీ ఏ విషయం అంటే ఈ చిత్రాన్ని ఏ భాషలో తెరకెక్కిస్తారు అని.

మాములుగా అయితే పాన్ ఇండియన్ సినిమాలను రెండు లేదా మూడు భాషల్లో కూడా ఏకకాలంలో తెరకెక్కిస్తారు. దీనికి కూడా అలానే ప్లాన్ చేసి ఉండొచ్చు కానీ నీల్ మాత్రం ఈ అంశాన్ని ఇప్పుడే రివీల్ చెయ్యాలి అనుకోడం లేదట. సో ఈ సస్పెన్స్ కు తెర పడాలి అంటే అప్పటి వరకు ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం :

More