ఓటీటీలో వచ్చాక “ప్రేమలు” కి వేరే రెస్పాన్స్..

ఓటీటీలో వచ్చాక “ప్రేమలు” కి వేరే రెస్పాన్స్..

Published on Apr 14, 2024 7:05 AM IST

ఇటీవల మళయాళ సినిమా నుంచి వచ్చిన పలు సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నస్లైన్ కె గఫుర్ అలాగే మమిత బైజు హీరోయిన్ గా దర్శకుడు గిరీష్ ఎడి తెరకెక్కించిన రోమ్ కామ్ డ్రామా “ప్రేమలు” కూడా ఒకటి. మరి మళయాళ సినిమా తర్వాత తెలుగు లో కూడా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి భారీ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా థియేట్రికల్ లో ఉన్నంతవరకు యునానిమాస్ పాజిటివ్ టాక్ వినిపించింది.

కానీ ఎప్పుడైతే ఓటీటీ లో రిలీజ్ కి వచ్చిందో ఈ ముందు అంతా వినిపించిన టాక్ అంచనాలు పెట్టుకొని చూసిన వారిలో చాలా మందికి రీచ్ కాలేకపోయింది అని చెప్పాలి. కొంతమంది ఓవర్ గా బిల్డప్ ఇచ్చారు అని కూడా అంటున్నారు. వీటితో ప్రేమలు ఓటీటీ లో వచ్చాక మాత్రం థియేటర్స్ లో ఉన్నంత కాలం అందుకున్న పాజిటివ్ టాక్ ని అయితే కొనసాగించలేకపోయింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు