ప్రెజర్ కుక్కర్ అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది- సుజోయ్&సుశీల్

Published on Feb 18, 2020 12:31 am IST

సాయి రోనక్, ప్రీతి అస్రాని జంటగా దర్శకులు సుజోయ్ అండ్ సుశీల్ దర్వకత్వంలో తెరకెక్కిన చిత్రం ప్రెజర్ కుక్కర్. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 21న విడుదల కానుంది. ఈ సంధర్భంగా దర్శక ద్వయం సుజోయ్ మరియు సుశీల్ మీడియాతో ముచ్చటించారు.

ఈ సినిమా నేటి సమాజంలో పిల్లల కెరీర్ పట్ల వారి పేరెంట్స్ ద్రుష్టి కోణం అనేది ఎలా ఉంది అనేది సెటైరికల్ గా చెప్పడం జరిగింది. వాస్తవ సంఘటలను కథావస్తువుగా తీసుకొని ఈ చిత్రం నిర్మించినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ మూవీకి ప్రెజర్ కుక్కర్ అని పేరు పెట్టడానికి అసలు కారణం, హీరో తన చుట్టూ ఉన్న పరిస్థుతుల వలన ఎప్పుడూ ఒక ప్రెజర్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక చదువు ఐపోయిన వెంటనే అమెరికా వెళ్లడం అనేది చాలా మంది అల్టిమేట్ గోల్ లా పెట్టుకుంటున్నారు. అక్కడికెళ్లి ఏమైనా సాధించడం ఒక గోల్ గా ఉండాలి కానీ, అమెరికా వెళ్లడమే గోల్ ఏమిటని ప్రశ్నిస్తున్నట్లు ఈ సినిమా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో మంచి ఎమోషన్స్ ఉంటాయి. మూవీ అందరికి నచ్చుతుందని దర్శకులు విశ్వాసం వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం :