షూట్ లో జాయిన్ అయిన సూపర్ స్టార్ !

Published on Jul 19, 2021 10:00 am IST

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ హీరోగా, పృథ్వీరాజ్‌ దర్శకత్వంలో ‘బ్రోడాడీ’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ హైదరాబాద్‌ లో మొదలవ్వడం విశేషం. ఈ సినిమా షూట్ కోసమే మోహన్‌లాల్‌ నిన్న హైదరాబాద్ కి వచ్చారు. ఈ రోజు ఉదయం నుండి మోహన్ లాల్ షూట్ లో పాల్గొనబోతున్నాడు. అన్నట్టు మరో రెండు వారాల పాటు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరగనుంది.

ప్రస్తుతం చేస్తున్న చిత్రీకరణలో మోహన్ లాల్ పై కొన్ని ఫైట్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. ఇక్కడ సీన్స్ పూర్తి అయ్యాక, తర్వాత కేరళలో కొత్త షెడ్యూల్‌ స్టార్ట్ చేస్తారట. భారీ హిట్ మూవీ ‘లూసీఫర్‌’ వంటి సినిమా వీరి కలయికలోనే వచ్చింది. మోహన్‌లాల్‌ – పృథ్వీల కలయిక నుంచి వస్తున్న రెండో సినిమా కాబట్టి ఇది, ఈ సినిమా పై ఇతర భాషల్లో కూడా ఫుల్ క్రేజ్ ఉంది. మరి ప్రేక్షకులలో ఉన్న ఆ భారీ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :