
లీడర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ప్రియ ఆనంద్ చివరగా కథానాయికగా “కో అంటే కోటి” చిత్రంలో కనిపించింది. తాజాగా ఈ భామ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ఒకటి తెలుగులోకి అనువాదమవుతుంది. “1,2,3,4” అనే పెరుతో రానున్న ఈ చిత్రానికి “అందరు ఇంజనీర్లె” అన్నది ఉపశీర్షిక. తమిళంలో “పుగై పడం” అన్న పేరుతో వచ్చిన ఈ చిత్రానికి రాజేష్ లింగం దర్శకత్వం వహించారు సత్యదేవ పిక్చర్స్ బ్యానర్ మీద ఆర్ సత్యనారాయణ తెలుగులోకి అనువదిస్తున్నారు. కాలేజిలో చదువుకునే ఎనిమిది మంది స్నేహితుల మధ్య జరిగే కథ ఈ చిత్రం. కోడైకనాల్ చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రానికి గంగై అమరాన్ సంగీతం అందించారు. గతంలో ఈ చిత్రానికి “ఎబిసిడి” అనేపేరు పరిశీలించగా తాజాగా “1,2,3,4”కి మార్చారు. ఈ చిత్రాన్ని వచ్చే నెల విడుదల చెయ్యనున్నారు. ఇదిలా ఉండగా ప్రియ ఆనంద్ ప్రస్తుతం హిందీలో “రంగ్రేజ్” మరియు “ఫఖ్రే” చిత్రాలు చేస్తుండగా తమిళంలో “ఎదుర్ నీచల్” చిత్రాన్ని చేస్తున్నారు.
ప్రియ ఆనంద్ ప్రధాన పాత్రలో “1,2,3,4”
ప్రియ ఆనంద్ ప్రధాన పాత్రలో “1,2,3,4”
Published on Feb 1, 2013 1:43 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- ‘స్పిరిట్’పై ఆ వార్తతో ఫ్యాన్స్ ఆందోళన.. అవసరం లేదంటున్న సందీప్ రెడ్డి..!
- ‘విశ్వంభర’ ట్రీట్ లేనట్టేనా.. వైరల్ అవుతున్న వశిష్ఠ కామెంట్స్..!
- మెగా158 ట్రీట్‌కు టైమ్ ఫిక్స్.. మెగా సెలబ్రేషన్స్‌కు సిద్ధమవుతున్న ఫ్యాన్స్..!
- సమీక్ష: ‘అమీర్ లోగ్’ – కొన్ని చోట్ల మెప్పించే యూత్ ఎంటర్టైనర్
- ఓటీటీ పార్ట్నర్ ని లాక్ చేసుకున్న “ఇరుముడి”
- ‘జైలర్ 2’ ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్.. స్టెప్పులతో ఊపేసిన పూర్ణ..!
- సమీక్ష : ది రెడ్ బ్యాగ్ : కొంతవరకే వర్కవుట్ అయ్యే యాక్షన్ థ్రిల్లర్
- ఇరుముడి’ రెస్పాన్స్ పై నాని పోస్ట్.. ఇది నిజమైన సెలబ్రేషన్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- ‘స్పిరిట్’లో కొరియన్ బాలయ్య.. అక్కడ మిస్ లీడ్ చేసారా?
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అజయ్ భూపతి లవ్ స్టోరీ “శ్రీనివాస మంగాపురం”
- తమిళ స్టార్ డైరెక్టర్‌తో వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ.. ఏ జోనర్లో అంటే..?
- టాలీవుడ్ పై మరోసారి బాలీవుడ్ స్టార్ దర్శకుడు అక్కసు.. ఎందుకిలా అయ్యాడు!
- జపాన్‌లో ‘మిరాయ్’ సెన్సేషన్.. రిలీజ్‌కు ముందే సాలిడ్ వసూళ్లు..!
- రవితేజ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ దిశగా ‘ఇరుముడి’!
- సమీక్ష: ‘అమీర్ లోగ్’ – కొన్ని చోట్ల మెప్పించే యూత్ ఎంటర్టైనర్

