కన్ను కొట్టీ కొట్టీ బోర్ కొట్టిందంటున్న సెన్సేషన్ హీరోయిన్ !

Published on Jan 29, 2019 1:07 am IST


సోషల్ మీడియా సెన్సేషన్ హీరోయిన్ మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన చిత్రం ‘ఒరు ఆధార్ లవ్’. ఈ సినిమా ‘లవర్స్ డే’ పేరుతో ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న తెలుగులో విడుదల అవుతుంది. ఒమర్ లులు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి షాన్ రెహమాన్ సంగీతం అందించారు. సుఖీభవ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది. ఇటీవలే ఈ చిత్రం ఆడియో ఈవెంట్ జరగగా బన్నీ ప్రత్యేక అతిధిగా వచ్చిన విషయం తెలిసిందే.

కాగా, తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూతో మాట్లాడిన ప్రియా.. ‘తాను ఇప్పటికే 200 సార్లు కన్ను కొట్టానని ఎక్కడికి వెళ్లినా కన్ను కొట్టమనే అడుగుతున్నారని.. దాంతో కన్ను కొట్టీ కొట్టీ నాకు బోర్ కొట్టిందని చెప్పుకొచ్చింది ప్రియా. ఇంకా మాట్లాడుతూ అసలు కన్ను కొట్టడం ఇంతలా ఎందుకు ఫేమస్ అయిందో తనకు అర్థం కావటం లేదని తెలిపింది. మొత్తానికి ఈ సెన్సేషన్ హీరోయిన్ కి కన్ను కొట్టీ కొట్టీ బోర్ కొట్టిందన్నమాట పాపం.

సంబంధిత సమాచారం :