ఆర్.పి పట్నాయక్ తో ప్రియమణి చిత్రం

ఆర్.పి పట్నాయక్ తో ప్రియమణి చిత్రం

Published on Oct 28, 2014 1:53 AM IST

RP-Patnaik-ANd-Priyamani
అవార్డు నటి ప్రియమణి తెలుగులో పలు గ్లామర్ పాత్రలు ధరిస్తూ వచ్చింది. అయితే అవన్నీ ఆమెకు పేరుని తెచ్చిపెట్టకపోగా వున్న పేరుని కోల్పోయేలా చేశాయి. ఆమె చివరి చిత్రం చారులత కూడా పరాజయం బాట పట్టింది. ఇప్పుడు ఈ భామ సంగీత దర్శకుడి నుండి దర్శకుడిగా మారిన ఆర్.పి పట్నాయక్ తో కలిసి కన్నడలో ‘వ్యూహ’ తెరకెక్కిస్తున్నాడు.

ప్రస్తుతం వీరిద్దరూ కన్నడ ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ సినిమా త్వరలో విడుదలకానుంది. ఈ చిత్రంపై ఇరువురూ తమ కెరీర్ ఆశలన్నీ పెట్టుకున్నారు. మరి ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి టాలీవుడ్ లో వారి పూర్వపువైభవాన్ని సంతరించుకోవాలని కోరుకుందాం

తాజా వార్తలు