రవితేజతో ప్రియాంక అరుళ్ మోహన్ ?

Published on Dec 6, 2020 7:04 am IST

రవితేజ తన తరువాత సినిమాని రమేష్ వర్మ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి అయింది. త్వరలోనే షూటింగ్ కి కూడా సిద్ధం అవుతుంది టీమ్. అయితే, ఈ సినిమాలో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక ‘గ్యాంగ్ లీడర్’లో నాని సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది.

కాగా ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉందట, ఈ సాంగ్ కోసం కేథరీన్ థెరీసాను అనుకుంటున్నారట. ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. ఇకపోతే ప్రస్తుతం రవితేజ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తోన్న ‘క్రాక్’ సినిమా రవితేజకు పూర్వవైభవాన్ని తీసుకొస్తోందట. ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఏమైనా రవితేజ ‘డిస్కో రాజా’తో ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేకపోయాడు. మరి క్రాక్ సినిమాతోనైనా అందుకుంటాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More