నాగ చైతన్యకు జోడీగా ప్రియాంక

Published on May 28, 2021 8:00 pm IST

అక్కినేని నాగార్జున త్వరలో ‘బంగార్రాజు’ చిత్రాన్ని మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ కాగా ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నాగార్జున ప్రజెంట్ కమిట్మెంట్స్ పూర్తవ్వగానే ఈ సినిమా పట్టాలెక్కుతుందని తెలుస్తోంది. ‘సోగ్గాడే చిన్ననాయన’కు ఇది సీక్వెల్. ఇందులో నాగ చైతన్య ఒక కీ రోల్ చేస్తారని బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నాగ చైతన్యకు జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటించనుందట. ప్రియాంక అరుల్ మోహన్ గతంలో ‘గ్యాంగ్ లీడర్, శ్రీకారం’ సినిమాలు చేసింది.

ఈ రెండూ పెద్ద విజయాన్నిసాధించలేకపోయినా ప్రియాంక పెర్ఫార్మన్స్ పట్ల ప్రేక్షకులు ఇంప్రెస్ అయ్యారు. అందుకే మేకర్స్ ఆమెను కన్పిడర్ చేసి ఉండవచ్చు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీ రోల్ చేయనున్నారు. ఇకపోతే ప్రస్తుతం నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కొత్త చిత్రం చేస్తుండగా నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ విడుదలకు సిద్దంగా ఉంది. ఇది కాకుండా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతన్య ‘థాంక్యు’ సినిమా చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :