పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అవైటెడ్ చిత్రమే “ఓజి”. దీనిపై ఉన్న అంచనాలు కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్ గానే సాంగ్ తో ట్రీట్ ఇచ్చిన మేకర్స్ ఇపుడు మరో అప్డేట్ ఇస్తున్నట్టుగా కన్ఫామ్ చేశారు. మరి ఫైనల్ గా ఆ అప్డేట్ ఏంటో అనేది కూడా రివీల్ చేసేసారు. ఈ చిత్రంలో పవన్ సరసన యంగ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
మరి ఆమెని కన్మణిగా పరిచయం చేస్తూ రెండు ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని మేకర్స్ విడుదల చేశారు. మరి ఇందులో ప్రియాంక మోహన్ ఎంతో అందంగా కనిపిస్తుండగా ఓజాస్ భార్యగా కూడా మరో పోస్టర్ చూస్తే అర్ధం అవుతుంది. ఇక ఈ పోస్టర్స్ తోనే మరో ప్రామిస్ కూడా మేకర్స్ అందించారు. రెండో సాంగ్ ప్రోమోని అతి త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. మొత్తానికి మాత్రం ఓజి ఫ్యాన్స్ కి ఇదొక ప్లెజెంట్ టచ్ అని చెప్పొచ్చు.


