నాని 24లో మలయాళ సెన్సేషనల్ బ్యూటీ ?

Published on Jan 27, 2019 11:39 am IST

మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని తన 24వచిత్రంలో నటించనున్నాడు. ఇక ఈచిత్రంలో ఆరుగురు కథానాయికలు నటించనున్నారు. అందులో ఒక హీరోయిన్ గా మలయాళ బ్యూటీ ,వింక్ సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ ను తీసుకోవాలనుకుంటున్నారట మేకర్స్. అందుకు స్క్రీన్ టెస్ట్ నిర్వహించనున్నారని సమాచారం. ఒకవేళ ఆ టెస్ట్ ను క్లియర్ చేస్తే ప్రియా ప్రకాష్ ఈసినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసినట్లే.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈచిత్రానికి అనూప్ రూబెన్స్ కానీ అనిరుధ్ కానీ సంగీతం అందించే అవకాశం ఉంది. డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం అందించనున్నారు. ఈచిత్రం ఫిబ్రవరి 19నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇక నాని ప్రస్తుతం జెర్సీ అనే చిత్రంలో నటిస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తుది దశ షూటింగ్ ను జరుపుకుంటుంది. ఏప్రిల్లో ఈచిత్రం విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :