స్టార్ హీరో మరియు కొడుకుతో మల్టీస్టారర్ ప్రకటించిన నిర్మాత

Published on Oct 22, 2019 10:51 am IST

ఆదిత్య వర్మ మూవీ ఆడియో లాంచ్ వేదికగా ఆ చిత్ర నిర్మాత భారీ ప్రకటన చేశారు. నటుడు విక్రమ్ మరియు తన కుమారుడు అయిన ధృవ్ విక్రమ్ లతో వచ్చే ఏడాది ఓ భారీ మల్టీ స్టారర్ ఉంటుందని ప్రకటించి అందరిని ఆశ్చర్య పరిచారు. అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఆదిత్య వర్మ చిత్రంతో ధృవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా నిన్న ఈ మూవీ ఆడియో లాంచ్ వేడుక చెన్నైలో జరిగింది. కాగా ఈఫోర్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత ముఖేష్ మెహతా వచ్చే 2021-22 సంవత్సరాలలో విక్రమ్,ధృవ్ హీరోలుగా ఓ భారీ చిత్రం చేస్తునట్లు ప్రకటించడమే కాకుండా మూవీ పెద్ద రేంజ్ లో ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇప్పటికే చాలా ఆలస్యం అయిన ఆదిత్య వర్మ చిత్రం వచ్చే నెల 8న విడుదల కానుంది. బనిత సంధు,ప్రియా ఆనంద్ హీరోయిన్స్ గా నటించగా గిరీశాయ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇక విక్రమ్ ధ్రువ నక్షత్రం, పొన్నియిన్ సెల్వం, మరి కొన్ని చిత్రాలలో నటించనున్నారు. విక్రమ్ 58వ చిత్రంగా రానున్న మూవీలో ఆయన ఏకంగా 25 గెటప్స్ లో కనిపిస్తారు అని సమాచారం.

సంబంధిత సమాచారం :

More