తన తండ్రి కోసం క్షరకునిగా మారిన నిర్మాత బండ్ల గణేష్.!

Published on May 8, 2021 2:05 pm IST

మన పని మనం చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు అది ఎలాంటిది అయినా కూడా అని తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మన వాళ్ళ పనులు మనమే చేసుకోడం కూడా చాలా బెటర్ అనే పరిస్థితిగా మారింది. మరి ఈ క్రమంలోనే మన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మరియు నటుడు బండ్ల గణేష్ తన తండ్రి కోసం క్షరకునిగా మారారు. ప్రస్తుతం ఉన్నరోజుల్లో బయట ఎలా ఉంటుందో చూస్తూనే ఉన్నాము..

అందుకే కరోనా భయంతో తానే తన తండ్రికి తమ షాద్ నగర్ నివాసంలో కటింగ్ చేసానని ఆ బ్యూటిఫుల్ మూమెంట్ ను బండ్ల గణేష్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మరి ఇటీవలే బండ్ల కూడా కరోనా నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. అలాగే తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించి తన పవర్ ఫుల్ స్పీచ్ తో ఓ రేంజ్ హై ఇచ్చిన విషయం కూడా మనం చూసాము.

సంబంధిత సమాచారం :