కరోనా కారణంగా ప్రముఖ నిర్మాత మృతి..!

Published on Jul 4, 2020 10:49 am IST

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నిర్మాత పోకూరి బాబురావు సోదరుడు పోకూరి రామారావు మృతి చెందారు. నిన్న సాయంత్రం పోకూరి రామారావు కరోనా వైరస్ కారణంగా తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తుంది. మణికొండలో గల తన నివాసంలో ఈ దుర్ఘనట చోటుచేసుకుంది.ఈ తరం ఫిల్మ్స్ బ్యానర్ లో వచ్చిన అనేక హిట్ చిత్రాలకు పోకూరి రామారావు సమర్పకులుగా ఉన్నారు. పోకూరి రామారావు వయసు 64 ఏళ్లుగా తెలుస్తుంది.

నేటి భారతం, ఎర్ర మందారం, యజ్ఞం, రణం వంటి అనేక హిట్ చిత్రాలు ఈ తరం బ్యానర్ లో తెరకెక్కాయి. పోకూరి రామారావు అకాల మృతికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. వారి కుటుంబానికి ధైర్యం, ఆయన ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :

More