ప్రముఖ నిర్మాత కన్నుమూత !

Published on May 12, 2019 5:48 pm IST

ఎందరో సినీ దిగ్గజాలని వెండి తెరకు పరిచయం చేసిన ప్రముఖ సినీ నిర్మాత విజయా సంస్థల అధినేత నాగిరెడ్డి కుమారుడైన వెంకట్రామిరెడ్డి ఇకలేరు. వెంకట్రామిరెడ్డి నిర్మాతగానే కాకుండా పారిశ్రామికవేత్తగానూ రాణించారు. అయితే గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న వెంకట్రామిరెడ్డి చెన్నైలో తుదిశ్వాస విడిచారు.

వెంకట్రామిరెడ్డి తన తండ్రి నాగిరెడ్డి నెలకొల్పిన విజయా సంస్థలోనే విశాల్‌, అజిత్‌, విజయ్‌ లాంటి హీరోలతో పలు విజయవంతమైన సినిమాలను నిర్మించారు. అలాగే తన తండ్రి బి.నాగిరెడ్డి పేరిట ఉత్తమ నిర్మాతలకు ప్రతియేటా పురస్కారాలను కూడా ఆయన అందిస్తూ వస్తున్నారు. వెంకట్రామిరెడ్డి మృతి పై తెలుగు తమిళ సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలుపుతున్నారు.

సంబంధిత సమాచారం :

More