‘ఏజెంట్’ ఓటిటి రిలీజ్ పై ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్

‘ఏజెంట్’ ఓటిటి రిలీజ్ పై ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్

Published on Apr 9, 2024 3:08 PM IST


యువ నటుడు అఖిల్ అక్కినేని హీరోగా గత ఏడాది ఆడియన్స్ ముందుకి వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ ఏజెంట్. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీని సురేందర్ 2 సినిమాస్ తో కలిసి ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర గ్రాండ్ లెవల్లో నిర్మించారు. అయితే మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈమూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక థియేటర్స్ లో రిలీజ్ అయి ఏడాది గడిచినప్పటికీ కూడా ఈమూవీ ఓటిటి లోకి ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు.

కాగా ఈ మూవీ ఎప్పుడు ఓటిటి లోకి వస్తుంది అంటూ తాజాగా ఒక అభిమాని ట్విట్టర్ లో అడిగిన ప్రశ్నకు నిర్మాత అనిల్ సుంకర బదులిచ్చారు. నేను ఇప్పటికే రెండు సార్లు తెలియజేసాను. మేము డిజిటల్‌ రైట్స్ ని బి4యు వారికి విక్రయిస్తే వారు వాటిని సోనీకి విక్రయించారు. కాబట్టి త్వరలోనే ఏజెంట్ ఓటిటిలోకి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అన్నారు అనిల్ సుంకర. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు