బడిలోకి అడుగులు వేసిన అల్లు అయాన్ !
Published on Jun 12, 2017 1:21 pm IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ ఇప్పుడు నాలుగేళ్ల బుడతడు.నిన్న జరిగిన డీజే ఆడియో వేడుకలో అల్లు అయాన్ చురుకుదనం అక్కడున్న అభిమానులనే కాదు అల్లు అర్జున్ సైతం ఆశ్చర్య పడేలా చేసింది.

బన్నీ, స్నేహ ల ముద్దుల కొడుకు బడికి వెళ్లడం కూడా ప్రారంభించాడు. అల్లు అయాన్ తొలిసారి నేడు స్కూల్ కి వెళ్లాడు. ఈ విషయాన్ని అతడి తల్లి స్నేహ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అల్లు అయాన్ బ్యాగ్ తగిలించుకుని స్కూల్ వైపు బుడిబుడి అడుగులు వేస్తున్న ఫోటోని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బన్నీ, స్నేహ ల దంపతులకు ఇది అత్యంత సంతోషాన్ని ఇచ్చే అంశం అని చెప్పడంలో సందేహం లేదు.

 
Like us on Facebook