‘మా’లో మళ్లీ గందరగోళం.. పరుచూరికి అవమానం !

Published on Oct 20, 2019 4:38 pm IST

మొత్తానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మళ్లీ గందరగోళం రగులుకుంది. ఎప్పుడు ఏదొక సమస్యతో ‘మా’ వార్తలెక్కడం ఆనవాయితీగా మారిపోతుంది. ప్రసుత వివాదంలోకి వెళ్తే.. ‘మా’ అధ్యక్షుడిగా ఉన్న సీనియర్ నరేష్‌ కు తెలియకుండానే ‘మా’ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న జీవితా రాజశేఖర్.. ఆదివారం ఫిలిం ఛాంబర్‌లో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశంలో నరేష్ వర్గానికి, జీవితా రాజశేఖర్ వర్గానికి మధ్య మాటల యుద్ధం జరిగిందని తెలుస్తోంది.

దాంతో కొంతమంది సభ్యులు తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ ఆ సమావేశం నుంచి వాకౌట్ చేశారట. ఇక ఈ సందర్భంగా నటుడు పృథ్వీ మాట్లాడుతూ… ‘తనకు ఈసీ మెంబర్ పదవి అక్కర్లేదని, పద్దతి మార్చుకోకపోతే తాను రాజీనామా చేస్తానని సీరియస్ అయ్యారు. నాలుగు వందలకు పైగా చిత్రాలకు కథలు రాసిన పరుచూరి గోపాలకృష్ణకు అవమానం జరిగిందని, పరుచూరి కంటతడి పెడుతూ వెళ్లిపోయారని పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుడిగా గెలిచినందుకు ఆనందపడాలో బాధ పడాలో తెలియడం లేదన్నారు. ముఖ్యంగా మా’ లో ఎవరి గ్రూపులు వారు పెట్టుకున్నారని, మెంబర్స్‌ కూడా ఎవరికి వారే ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. మరి ‘మా’ వ్యవహారం ఇంకెన్నాళ్లు సాగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More