బల్గెరియా బయలుదేరి వెళ్లిన పవన్ !
Published on Jul 19, 2017 12:07 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 25వ చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని కొంతభాగం విదేశాల్లో చిత్రీకరించాలని టీమ్ నిర్ణయించింది. ఈ మేరకు నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ లు బల్గెరియా బయలుదేరి వెళ్లారు.

20 రోజులపాటు జరగబోయే ఈ షెడ్యూల్లో ఒక ఛేజ్ సీక్వెన్స్, రెండు పాటలు, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా సినిమా ఫస్ట్ లుక్, విడుదల తేదీలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. ఇకపోతే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాలో పవన్ కు జోడీగా అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ లు నటిస్తున్నారు.

 
Like us on Facebook