యూత్ ఫుల్ కాన్సెప్ట్ తో `పంక్చర్’ !

యూత్ ఫుల్ కాన్సెప్ట్ తో `పంక్చర్’ !

Published on Feb 15, 2020 1:15 AM IST

చంద్రుడు క్రియేషన్స్ సమర్పణలో శ్రీ లక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘పంక్చర్’. శ్రీరంగం శేషశ్రీ దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హరీష్, వినోద్, కార్తీక్, వెంకట చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. గీత్ షా , సంజన, లాస్య శ్ర్రీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తణికెళ్లభరణి, పోసాని, ఎల్బీశ్రీరామ్, జయప్రకాష్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అర్జున్ సంగీతం అందించగా తోటపల్లి సాయినాథ్ డైలాగ్స్ అందిస్తున్నారు. ప్రెసెంట్ షూటింగ్ జరుగుతోంది. వాలెంటైన్స్ డే సంధర్భంగా చిత్రయూనిట్ శుక్రవారం హైదరాబాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సమర్పకులు రాజు రాళ్లబండి మాట్లాడుతూ..‘పంక్చర్ మంచి సబ్జెక్ట్ తో వస్తున్న సినిమా. సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ సినిమా నిలుస్తుంది’అన్నారు.

రచయిత సాయినాథ్ మాట్లాడుతూ..‘ఇది స్ర్కీన్‌ప్లే బేస్డ్ మూవీ. ప్రస్తుతం వినోదాత్మకమైన చిత్రాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలాంటి సినిమానే పంక్చర్. వినోదంతో పాటు ఆలోచించజేసే సినిమా ఇది. మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ మంచి సంగీతం అందిచారు’అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ మాట్లాడుతూ..‘పంక్చర్ ఇదొక వెరైటీ టైటిల్. అయినా సబ్జెక్ట్ చాలా బాగుంది. సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయి. చిన్న సినిమాలను ప్రొత్సహించాలని కోరుతున్నా’ అన్నారు.

దర్శకనిర్మాత శ్రీరంగం శేషశ్రీ మాట్లాడుతూ..‘ఇది నా మొదటి సినిమా. నలుగురు కుర్రాళ్ల మధ్య ప్రస్తుతం జరిగే పరిణామాల నేపథ్యంలోనే కథ ఉంటుంది. అనుభవజ్ఞులైన సంగీత దర్శకుడు అర్జున్, అలాగే సాయినాథ్ మా సినిమాకు సహకరించినందుకు ధన్యవాదాలు. చక్కటి కథతో హాస్యంతో నిండుకున్న సినిమా పంక్చర్. ‘డైరెక్టర్ పై పూర్తి నమ్మకం ఉంది. స్ర్కిప్ట్ నన్ను బాగా ఆకట్టుకుంది. మాకు అవకాశం ఇచ్చిన శ్రీరంగం శేషశ్రీ గారికి కృతజ్ఞతలు’తెలిపారు హీరోలు. చిత్రయూనిట్ ఈ సినిమాకు సంబంధించి ఓ కాంటెస్ట్ నిర్వహించింది. ‘పంక్చర్’ సినిమా టైటిల్ ని బట్టి కథ ఎలా ఉంటుందో ఊహించి రాసిన వారికి భారీ ప్రైజ్ మనీ ప్రకటించారు. కథ రాసి 9121594273 ఈ నెంబర్ కు వాట్సప్ చేయాలని కోరారు. సినిమా స్టోరీని పోలిఉన్న కథలను రాసివారిని లక్కీ డ్రా తీసి విజేతగా ఎంపిక చేస్తామన్నారు. గెల్చుకున్న వారికి పదిలక్షల విలువ చేసే ఓపెన్ ప్లాట్ గిఫ్ట్ గా ఇస్తామని దర్శక నిర్మాత శ్రీరంగం శేషశ్రీ ప్రకటించారు.

`Puncture ‘with Youth Full Concept!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు