బ్రౌన్ మందిరాన్ని సందర్శించిన పురాణపండ శ్రీనివాస్

Published on Feb 14, 2020 5:30 pm IST

పాత్రికేయుడు సన్నిధానం శాస్త్రి కృషి, ఆదరణ అద్వితీయం.

రాజమహేంద్రవరం ; ఫిబ్రవరి : 14

మానసిక విస్ఫోటనాలకూ, గందరగోళాలకు దూరంగా అద్భుత ఆధ్యాత్మిక ప్రక్రియలద్వారా లక్షలమందిని జ్ఞానపథంవైపు నడిపించడంలో తెలుగురాష్ట్రాలలో తన అపురూప గ్రంథ రచనాసంకలనాలతో దూసుకుపోతున్న ప్రముఖ రచయిత , శ్రీశైలదేవస్థానం పూర్వప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ ఇటీవల రాజమహేంద్రవరంలోని బ్రౌన్ మందిరాన్ని సందర్శించి, బ్రౌన్ చిత్రపటానికి ఘన నివాళులర్పించడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. సాహిత్య వేత్తలుగా, సాహితీ సేవకులుగా తెలుగురాష్ట్రాలలో విశేష ఖ్యాతిగాంచిన ప్రముఖకవి సన్నిధానం నరసింహ శర్మ తన స్వగృహంలో ఒక గదిని ప్రత్యేకంగా బ్రౌన్ మందిరంగా ఏర్పాటుచేసి గతకొన్ని సంవత్సరాలుగా విఖ్యాత సాహితీ సాంస్కుతిక వేత్తలతో అనేక అపూర్వ కార్యక్రమాలను నిర్వహించడం విశేషం. ఈ అంశంలో – బ్రౌన్ మందిర కార్యక్రమాలలో సన్నిధానం శర్మ సోదరుడు , ప్రముఖపాత్రికేయులు సన్నిధానం శాస్త్రి ఉత్సాహవంతమైన భూమిక పోషిస్తూ … పరిపూర్ణవంతమైన భాషా సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ తెలుగురాష్ట్రాలలో అనేకమంది విజ్ఞులచేత ‘ శహభాష్ ‘ అనిపించుకుంటున్నారు.

స్వతహాగా భాషాభిమాని అయినా సన్నిధానం శాస్త్రికి సంస్కృతాంధ్ర భాషలపై పట్టు ఎక్కువ. పెద్దల్ని , ప్రతిభావంతుల్ని గౌరవించడంలో సన్నిధానం శాస్ట్రీ చూపే చొరవ , వినయం ఇప్పటి తరాలకు తెలియాల్సిన అవసరం వుంది. తన అన్నగారు సన్నిధానం శర్మ గౌరవాన్ని పెంచుతూ బ్రౌన్మందిరంలో సన్నిధానం శాస్త్రి విజ్ఞతతో చేస్తున్న ఒక్కొక్క కార్యక్రమం ఆదర్శనీయంగా ఉండటం గర్వంగానే చెప్పాలి. జీవనయాత్రలో ఎన్నో ఎన్నో కష్టాల్ని చూసి , మొక్కవోని అపరిమిత విశ్వాసంతో అనేక ఆధ్యాత్మిక ప్రయోజనకరమైన నిర్మాణాత్మక కార్యక్రమాలని నిర్వహించిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అకస్మాత్తుగా రాజమహేంద్రవరం బ్రౌన్మందిరానికి విచ్చేసినప్పుడు సన్నిధానం శాస్త్రి తనకళ్లముందు పెరిగిన పురాణపండ శ్రీనివాస్ లోని ప్రతిభాపట్ల చూపిన ఆత్మీయత మరువలేనిదని ప్రముఖ చిత్రకారుడు భోగరాజు శ్రీనగేష్ ( శ్రీనగేష్ )పేర్కొనడం గమనార్హం. బ్రౌన్ మందిరాన్ని సందర్శించిన పురాణపండ శ్రీనివాస్ బ్రౌన్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు.

బ్రౌనుదొర మానసిక సౌందర్యమే తెలుగుభాషా సౌందర్యానికి గొడుగు పట్టిందని, తెలుగు భాషా సాహిత్యాల్ని విస్తృతంగా అందించేందుకు బ్రౌన్ మందిరం ద్వారా సన్నిధానం శాస్త్రి తన అన్నగారి స్పూర్తితో చేస్తున్న సేవ నిరుపమానమని ఈ సందర్భంగా శ్రీనివాస్ అభినందించారు. ఈ సందర్భంగా పురాణపండ శ్రీనివాస్ ని జ్ఞాపిక , దుస్సాలువతో బ్రౌన్మందిరం పక్షాన సన్నిధానం శాస్త్రి ఘనంగా సత్కరించి , త్వరలో పురాణపండ శ్రీనివాస్ మళ్ళీ బ్రౌన్ మందిరానికి విచ్చేసి ఒక జ్ఞానపరీమళ వాగ్వైభవంతో కొన్ని అంశాల్ని వివరిస్తారని ప్రకటించారు. ఒక్కొక్క బలమైన ఆధ్యాత్మిక గ్రంధంతో తెలుగు గుండెల్లో పాతుకుపోతున్న పురాణపండ శ్రీనివాస్ సామర్ధ్యం ఇప్పుడు దేశదేశాలలో మారుమ్రోగుతోందనడం నిర్వివాదాంశం. ఆయన రచనల, సంకలనాలలోని సొగసులు .. నిస్వార్థసేవ చరిత్రాత్మకమైనవని ఆచార్య సి.నారాయణరెడ్డి అన్న మాటలు ఈ సందర్భంలో మరోసారి జ్ఞప్తికి తెచుకోవాల్సిందే. ఈ కార్యక్రమంలో జిల్లా Vaidya శాఖకు సంబంధిన ప్రముఖులు పాణంగిపల్లి శ్రీనివాస్, ప్రఖ్యాత చిత్రకారులు శ్రీనగేష్ , ప్రముఖ పురోహితులు వీరభద్రం తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

సంబంధిత సమాచారం :

X
More