బాలయ్యతోనే మళ్లీ ప్లాన్ చేస్తున్నాడట

Published on Jan 22, 2023 2:00 am IST


డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘లైగర్‌’ సినిమాతో ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, మరోపక్క పూరి, మెగాస్టార్ చిరంజీవి కోసం ఓ పవర్ ఫుల్ కథ రాస్తున్నాడని… పూరి తన టీమ్ తో మెగాస్టార్ స్క్రిప్ట్ పైనే కసరత్తులు చేస్తున్నాడని ఆ మధ్య వార్తలు వైరల్ అయ్యాయి. ఐతే, తాజాగా పూరి తర్వాత సినిమా పై మరో అప్ డేట్ వినిపిస్తోంది. పూరి జగన్నాధ్ బాలయ్య బాబుతోనే తన తర్వాత సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

బాలయ్య బాబు కోసం పూరి జగన్నాధ్ మంచి ఎంటర్ టైన్మెంట్ ఉన్న కథను రాశాడట. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఈ కాంబినేషన్ సెట్ అయ్యేలా ఉంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇదొక ఎమోషనల్ యాక్షన్ స్టోరీ అని తెలుస్తోంది. తండ్రి కొడుకుల మధ్య సాగే ఈ కథలో ఇండియట్ కి కొనసాగింపుగా ఉంటుందని టాక్ నడుస్తోంది. అయితే తండ్రి పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో కథ సాగుతుందట. ఈ సినిమాలో ఎమోషన్ ఉన్నా.. మెయిన్ గా కామెడీ బేస్డ్ గానే సినిమా నడుస్తోందని తెలుస్తోంది. మరీ బాలయ్య పూరికి ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :