డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రసతుతం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సినిమా షూటింగ్ తో బిజీ బిజీ గా ఉన్నాడు. ప్రస్తుతం గోవాలో ఉన్న ఈ చిత్ర టీం రేపటి నుంచి కొత్త షెడ్యూల్ ని ప్రారంభించనున్నారు. ఇది సెట్స్ పై ఉండగానే పూరి జగన్నాధ్ తన తదుపరి సినిమా మహేష్ బాబుతో చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడని ఇది వరకే తెలియజేశాం.
తాజా సమాచారం ప్రకారం పూరి జగన్నాధ్ మహేష్ బాబుతో చేయనున్న సినిమా స్క్రిప్ట్ ని పూర్తి చేసాడు. త్వరలోనే మహేష్ బాబుని కలిసి స్క్రిప్ట్ చెప్పనున్నారు. గతంలో మహేష్ బాబు – పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ‘పోకిరి’, ‘బిజినెస్ మేన్’ సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. మహేష్ కోసం పూరి రెడీ చేసిన స్క్రిప్ట్ కూడా పక్కా మాస్ ఎంటర్టైనర్ అని అందులోనూ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయని సమాచారం. మహేష్ బాబు స్క్రిప్ట్ ఓకే చేస్తే 2015 మొదట్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.


