హైదరాబాద్ రోడ్లపై పరుగులు తీస్తున్న పూరి !
Published on Dec 4, 2017 2:18 pm IST

డాషింగ్ డార్కెటర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం తన కుమారుడు ఆకాష్ పూరి హీరోగా ‘మెహబూబా’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే హిమాచల్ ప్రదేశ్, హర్యాన, పంజాబ్ వంటి ప్రాంతాల్లో సుమారు నెల రోజులపాటు నిర్విరామంగా షూటింగ్ జరుపుకుని మొదలై షెడ్యూల్ ముగించుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటోంది.

దర్శకుడు పూరి నగర రోడ్లపై కొన్ని ఛేజింగ్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. 1971 ఇండో-పాక్ యుద్ధ నైపథ్యంలో సాగే ఈ చిత్రం ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఉండనుంది. పూరి గత చిత్రాలకి పూర్తి భిన్నమైనదిగా ఉంటుందని చెప్పబడుతున్న ఈ చిత్రాన్ని పూరి స్వయంగా నిర్మిస్తుండగా సందీప్ చౌత సంగీతం అందిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా నూతన నటి నేహా శెట్టి నటిస్తోంది.

 
Like us on Facebook