‘డబుల్ ఇస్మార్ట్’ కన్ఫర్మ్ చేసిన పూరి

Published on Jul 19, 2019 2:01 am IST

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఈరోజే విడుదలై మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. మాస్ ప్రేక్షకులకు సినిమా బాగా నచ్చింది. ఈ దెబ్బతో పూరి హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారంతా. దీంతో పూరి చాలా సంతోషంగా ఉన్నారు. ఇక ఆయన గురువు రామ్ గోపాల్ వర్మ ‘హేయ్ పూరి.. త్వరగా ఇస్మార్ట్ శంకర్ 2 స్టార్ట్ చెయ్. ఈసారి డబుల్ దిమాక్ కాదు ట్రిపుల్ దిమాక్ ఉండాలి’ అంటూ ట్వీట్ చేశారు.

దానికి సమాధానమిస్తూ ఆల్రెడీ ‘డబుల్ ఇస్మార్ట్’ టైటిల్ రిజిస్టర్ చేయించాను సర్ అని సీక్వెల్ ఉంటుందని కన్ఫర్మ్ చేసేశారు. మరి ఇందులో కూడా హీరోగా రామ్ చేస్తాడా లేకపోతే మరెవరైనా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. పూరి తర్వాతి సినిమాను ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఇదే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. ఇక పూరి ఎలాగూ జెట్ స్పీడ్ కాబట్టి ఇంకో నాలుగైదు నెలల్లో ‘డబుల్ ఇస్మార్ట్’ను రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

సంబంధిత సమాచారం :