మన టాలీవుడ్ మాస్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లాస్ట్ టైం ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత మళ్ళీ సాలిడ్ హిట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే లైగర్ డిజప్పాయింట్మెంట్ తర్వాత తనకి ఒక కాల్ వచ్చినట్టుగా పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ ఈవెంట్ లో ఆ మధ్య చెప్పడం జరిగింది.
అయితే ఆ కాల్ ఎవరి నుంచో కాదు విజయేంద్ర ప్రసాద్ నుంచే ఆ సినిమా ప్లాప్ అయ్యాక తన నుంచి అలాంటి సినిమాలు వస్తుండడం బాదేసి అసలు పూరి కథ రాసుకున్నపుడు ఒకసారి ఆ కథ ఏంటి అనేది తనకి కూడా చెప్పాలని విజయేంద్ర ప్రసాద్ గారు అప్పుడు తన నుంచి ఏమన్నా ఉపయోగం ఉంటుందేమో అన్నట్టుగా తెలిపారని పూరి తెలిపారు. అయితే ఆ మాటలతో తాను చాలా ఎమోషనల్ అయ్యానని చెప్పారు.
అయితే అప్పుడు డబుల్ ఇస్మార్ట్ కి కూడా కథ చెప్పలేదని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన సినిమా కదా తీశాకే కలుద్దాం అనుకున్నానని పూరీ చెప్పడం జరిగింది. అయితే డబుల్ ఇస్మార్ట్ కూడా వైఫల్యం చెందింది. ఇటీవలే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో పూరి సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
మరి బహుశా ఇపుడు విజయేంద్ర ప్రసాద్ గార్ని పూరీ తన కథ ఏంటి అనేది చెప్పి కీలక ఇన్ ఫుట్స్ తీసుకోవడమే వారి మీటింగ్ వెనుక ఉన్న అసలు కారణం కావచ్చని చెప్పాలి. సో ఈసారి మాత్రం రిస్క్ చేసి పూరి మిస్టేక్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యారో ఏమో కానీ మొత్తానికి వీరి మీటింగ్ ఆసక్తిగా మారింది.


