పూరి సినిమా అంటే ఆమాత్రం ఉండాల్సిందే కదా

Published on Feb 13, 2020 2:03 am IST

పూరి జగన్నాథ్ సినిమా అంటే హీరోలకు పండుగలాంటిది. ఎందుకంటే ఆయనతో చేసిన సినిమా హిట్టైతే లభించే క్రేజ్ మామూలుగా ఉండదు. ఒక్కసారిగా కెరీర్ గ్రాఫ్ కమర్షియల్ హీరో అనే టర్న్ తీసుకుంటుంది. అంతేకాదు.. అన్ని హంగులతో, ఖర్చుకు లోటు లేకుండా పూర్తిస్థాయి కమర్షియల్ చిత్రం చేయాలనే కోరిక కూడా తీరిపోతుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సంతోషం కూడా ఇదే.

ఆయన కెరీర్లోనే పెద్ద బడ్జెట్ సినిమాను పూరి తెరకెక్కిస్తున్నారు. అది కూడా నేరుగా హిందీ పరిశ్రమలోకి లాంఛ్ చేస్తూ. ఇక కేవలం తెలుగు వెర్షన్ అంటేనే పూరి మేకింగ్ ఖరీదుగా ఉంటుంది.. అలాంటిది హిందీలో కూడా అంటే అది డబుల్ అవుతుంది. ఈ చిత్రం కోసం రూ.5 కోట్లు వెచ్చించి సెట్ వేయించారంటేనే సినిమా బడ్జెట్ హెవీ అని అర్థమవుతుంది. మరి పూరి బైలింగ్వల్ సినిమా అంటే ఆమాత్రం ఉండాల్సిందే కదా.

సంబంధిత సమాచారం :