వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం : పూరి జగన్నాథ్

Published on May 26, 2019 12:21 pm IST

దర్శకుడు పూరి జగన్నాథ్ రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపరనే సంగతి తెలిసిందే. కానీ రాజకీయాల పట్ల అమితాసక్తి కలిగిన ఆయన సోదరుడు ఉమా శంకర్ గణేష్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా తరపున నర్సీపట్నం నుండి పోటీచేసి గెలుపొందారు. ఈ విషయాన్ని పూరి ప్రస్తావిస్తూ నా తమ్ముడు పోటీ చేసిన దగ్గర ఫైట్ గట్టిగా ఉంటుందనుకుంటే వార్ వన్ సైడ్ అయిపోయింది. ఏపీ జనమంతా మీటింగ్ పెట్టుకుని మరీ జగన్‌కు ఓటేయాలని నిర్ణయించుకున్నట్టున్నారని అన్నారు.

అలాగే జగన్ పోరాట పటిమను పొగుడుతూ ఎన్నికల్లో గెలిచాక అతనిలో విజయ గర్వం లేదు కేవలం సేదతీరుతున్నారు. నిజంగా అతనొక వారియర్. రాజన్న కొడుకు అనిపించాడు. నా తమ్ముడికి ఆయనంటే ప్రాణం. గత ఎన్నికల్లో ఓడిపోయినా మళ్ళీ యుద్ధంలోకి లాక్కెళ్లి ఇంతటి విజయాన్ని
ఇచ్చినందుకు జగన్ మోహన్ రెడ్డిగారికి నేను, నా కుటుంబం రుణపడి ఉంటాం అన్నారు. ఇకపోతే పూరి ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ చివరి దశ పనుల్లో బీజీగా ఉన్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More