నేను హిట్లో ఉంటేనే మహేష్ నాతో సినిమా చేస్తాడు : పూరి

Published on Jul 19, 2019 5:09 pm IST

‘జనగణమన’.. పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ చిత్రాన్ని మహేష్ బాబుతో చేయాలని ఆయన క్సచాలానే ట్రై చేశారు. కానీ వర్కవుట్ కాలేదు. ఈలోపు మహేష్, పూరిల మధ్య దూరం పెరిగాయని తెలిపే సందర్భాలు చోటుచేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయినా మహేష్ అభిమానులు మాత్రం మహేష్ బాబుతో సినిమా చేయమని పూరిని నిత్యం అడుగుతూనే ఉంటారు.

తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రమోషన్లలో పాల్గొన్న పూరి దీని గురించే మాట్లాడుతూ మహేష్ బాబుతో రెండు హిట్ సినిమాలు తీశాననే ప్రేమతో మరో సినిమా చేయమని ఫ్యాన్స్ అడుగుతుంటారు. నిజానికి నాకు మహేష్ బాబు కంటే ఆయన అభిమానులంటేనే ఎక్కువ ఇష్టం. అందుకే వాళ్ళ కోసం చెబుతున్నా.. నేను హిట్లలో ఉంటేనే మహేష్ నాతో సినిమా చేస్తాడు అంటూ సంచలనం రేపారు.

అయితే, నిజానికి పూరి వరుసగా మూడు ప్లాప్ ల్లో ఉన్నప్పుడే మహేష్ పూరికి ఆఫర్ ఇచ్చాడు. మహేష్ పూరితో చేసిన మొదటి సినిమా పోకరికి ముందు పూరికి ఆంధ్రావాలా, 143, సూపర్ ఇలామూడు సినిమాలు వరుసగా ప్లాప్ లు ఉన్నాయి. అలాగే మహేష్ పూరితో చేసిన ‘బిజినెస్ మెన్’ సినిమాకి ముందు కూడా పూరికి ‘ఏక్ నిరంజన్, గోలీమార్, నేను నా రాక్షసి’ సినిమాల రూపంలో వరుసగా ప్లాప్ లు ఉన్నాయి. అయినా మహేష్ బిజినెస్ మెన్ కి పూరికిఆఫర్ ఇచ్చాడు. మరి పూరి ఎందుకు ఇలా మాట్లాడాడో.. ఏమైనా పూరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం అనిపించుకోదు.

పైగా సదరు యాంకర్ మరి ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్టైతే మహేష్ ఓకే చెప్పవచ్చు కదా అని అడగ్గా పూరి వెంటనే నేను ఓకే చెప్పడానికి నాకూ ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా అంటూ ఇంకో బాంబ్ పేల్చారు. పూరి మాటలు వింటే లోపల ఏదో గట్టి వ్యవహారమే జరిగినట్టు అర్థమవుతోంది.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More