సూపర్ కాన్ఫిడెంట్‌గా పూరి జగన్నాథ్ !

Published on May 12, 2019 9:00 pm IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేస్తున్న కొత్త చిత్రం ‘ఐస్మార్ట్ శంకర్’. ప్రారంభం నుండే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పాజిటివ్ క్రేజ్ ఏర్పడింది. హీరో రామ్ పూరి చెప్పిన కథ మీద నమ్మకముంచి చేద్దామనుకున్న ప్రాజెక్ట్స్ సైతం పక్కనబెట్టి సినిమా చేస్తున్నాడు. పూరి కూడా చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు.

ఎప్పటిలాగే తక్కువ రోజుల్లోనే టాకీ పార్ట్ షూట్ ముగించేశారు. ఇంకో నాలుగు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలుంది. తాజాగా టీజర్ విడుదల గురించి మాట్లాడిన పూరి మే 15న టీజర్ వస్తుందని, షూటింగ్ దాదాపు ముగిసిందని, రిలీజ్ డేట్ త్వరలోనే చెబుతానని అన్నారు. ఆయన మాటలు వింటే ఒకప్పటి పూరి పనితనాన్ని చూస్తామనే నమ్మకం కలుగుతోంది.

ఇకపోతే ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. గతంలో పూరి, మణిశర్మల కలయికలో ‘పోకిరి’ లాంటి బ్రహ్మాండమైన సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. పూరి, ఛార్మిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్, నాభ నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More