‘విజయ్ దేవరకొండ’కే.. పూరి ఫిక్స్ !

Published on Aug 12, 2019 3:28 pm IST

పూరి జగన్నాథ్ మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ తో భారీ విజయాన్నే నమోదు చేశాడు. రామ్ హీరోగా నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద గుడ్ కలెక్షన్స్ ను రాబట్టింది. కాగా పూరి తన తరువాత సినిమాని సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో చెయ్యబోతున్నాడని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ.. ఛార్మి ‘పూరి – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా రాబోతుందని అధికారికంగా ప్రకటించింది.

మరి ఈ సినిమా ఏ జోనర్ లో తెరకెక్కనుంది.. సినిమాలో హీరోయిన్స్ గా ఎవరు నటించనున్నారు.. అలాగే మిగిలిన నటీనటులు ఎవరు అనే విషయాలను త్వరలోనే ప్రకటిస్తామనట్లు ఛార్మి ట్వీట్ చేసింది. ఇక ఈ సినిమా కూడా పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కించిన పూరి, మరి ఈ సినిమాకి ఏ నేపధ్యాన్ని ఎంచుకుంటాడో చూడాలి.

సంబంధిత సమాచారం :