పూరి ‘ఫైటర్’ ఇంకాస్త ఆలస్యం ?

Published on Dec 5, 2020 1:00 am IST

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న చిత్రం ‘ఫైటర్’. మొదటిసారి డాషింగ్ డైరెక్టర్, డాషింగ్ హీరో కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ‘ఫైటర్’ మీద అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభంలో కొద్దిరోజులు షూట్ జరగ్గా లాక్ డౌన్ కారణంగా సినిమా ఆగిపోయింది. లాక్ డౌన్ తర్వాత చిత్రీకరణ జరపాలని చూసినా వీలుకాలేదు. మళ్ళీ డిసెంబర్ నుండి చిత్రీకరణ మొదలుపెట్టాలని భావించారు పోరి. కానీ అది కూడ సాధ్యపడేలా కనిపించట్లేదు. తాజా సమాచారం మేరకు జనవరి 3వ వారం నుండి షూట్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారట పూరి.

కొత్తగా ప్రారంభించబోయే షెడ్యూల్లో యాక్షన్ ఎపిసోడ్స్ తెరకెక్కిస్తారట. ఇందుకోసం పెద్ద సంఖ్యలో విదేశీ ఫైటర్లను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వీరి రాక ఆలస్యం కావడం వల్లనే షూట్ ఆలస్యమవుతోందట. ఈ చిత్రాన్ని ఛార్మీతో కలిసి పూరి జగన్నాథ్ నిర్మిస్తుండగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జొహార్ సైతం నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీలో కూడ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More