‘బాలయ్య’తో సినిమా ఉంటుంది.. కానీ !

Published on Oct 19, 2021 12:00 am IST


పూరి జగన్నాథ్ తో తన కొత్త సినిమా ఉంటుందని ఆ మధ్య బాలయ్య బాబు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పూరి, బాలయ్య కోసం ఓ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ రాసాడని, అది ఒక ఎమోషనల్ యాక్షన్ స్టోరీ అని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత మాత్రం ఈ సినిమా పై ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం వీరి కలయికలో సినిమా ఉంటుందట.

కానీ వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత వీరి సినిమా స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. తండ్రి కొడుకుల మధ్య సాగే ఈ కథలో ఇండియట్ కి కొనసాగింపుగా ఉంటుందట. అయితే తండ్రి పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో కథ సాగుతుందట. కొడుకు గెలుపు కోసం తండ్రి ఏం చేశాడు అనేదే మెయిన్ లైన్ అని.. సినిమాలో ఎమోషన్ ఉన్నా.. మెయిన్ గా యాక్షన్ బేస్డ్ గానే సినిమా నడుస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్య – పూరి కాంబినేషన్‌లో ‘పైసా వసూల్’ చిత్రం వచ్చింది.

సంబంధిత సమాచారం :