‘విజయ్ దేవరకొండ’ సినిమా టైటిల్ మారుతుందట !

Published on Jan 21, 2020 8:00 pm IST

పూరి జగన్నాథ్ – సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా టైటిల్ ఫైటర్ అని ఇప్పటివరకూ సోషల్ మీడియాలో చలామణి అవుతూ వచ్చింది. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ మార్చబోతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాని రూపొందిస్తుండటంతో టైటిల్ ను మార్చాలనుకుంటున్నారట.

ఇక జనవరి 20 నుండి ముంబైలో ‘ఫైటర్’ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ థాయిలాండ్ లో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ లో ఉన్నాడు. కరణ్ జోహార్ నేతృత్వంలోని ధర్మ ప్రొడక్షన్స్ ఈ సినిమాని హిందీలో విడుదల చేస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా ముంబైలో షూట్ చేయనున్నారు. ముంబైలోని జుహు, తాజ్ హోటల్ లాంటి ఐకానిక్ ఏరియాల్లో షూట్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కించనున్నారు.

ఈ సినిమా కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమాని నిర్మించనున్నారు. విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More