‘ఫైటర్’ జనవరి 20 నుండి ముంబైలో.. !

Published on Jan 15, 2020 1:00 am IST

పూరి జగన్నాథ్ తన తరువాత సినిమాని సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్ డేట్ గురించి తెలిసింది. జనవరి 20 నుండి ముంబైలో ‘ఫైటర్’ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ థాయిలాండ్ లో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ లో ఉన్నాడు.

కాగా కరణ్ జోహార్ నేతృత్వంలోని ధర్మ ప్రొడక్షన్స్ ఈ ‘ఫైటర్’ చిత్రాన్ని హిందీలో విడుదల చేస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా ముంబైలో షూట్ చేయనున్నారు. ముంబైలోని జుహు, తాజ్ హోటల్ లాంటి ఐకానిక్ ఏరియాల్లో షూట్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కించనున్నారు.

ఇక అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ సరసన నటిస్తోంది. ఫైటర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమాని నిర్మించనున్నారు. విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More