పూరి ‘జనగణ మన’లో కొత్త స్టార్ ?

Published on Jul 30, 2019 7:28 pm IST

పూరి జగన్నాథ్ మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ తో భారీ విజయాన్నే నమోదు చేశాడు. రామ్ హీరోగా నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద గుడ్ కలెక్షన్స్ ను రాబడుతుంది. 11 రోజులకు గానూ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 30 కోట్లకు పైగా షేర్ ను రాబట్టింది. దాంతో పూరి తరువాత సినిమా పై సోషల్ మీడియాలో రూమర్స్ ఊపందుకున్నాయి. కాగా తాజాగా పూరి తన తరువాత సినిమాని రాకింగ్ స్టార్ యశ్ తో చెయ్యబోతున్నాడట.

కేజీఎఫ్ చాప్టర్- 1లో కథానాయకుడిగా నటించిన యశ్ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అందుకే ఎప్పటినుంచో తానూ మహేష్ బాబుతో తీయాలనుకుంటున్న ‘జనగణ మన’ సినిమాను యశ్ తో చేయాలని పూరి అనుకుంటున్నాడట. యశ్ సైతం పూరి సినిమా పై ఆసక్తిగా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. మరి వీటిలో నిజమెంత తేలాలంటే పూరి నుండి అధికారిక సమాచారం వెలువడే వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :