ముంబైలో పూరి కొత్త అడ్డా.. చాలా కాస్ట్లీ

Published on Jan 27, 2020 12:48 pm IST

‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో పూరి జగన్నాథ్ దర్శకుడిగా, నిర్మాతగా గ్రాండ్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం వహించి ఛార్మి సైతం నిర్మాతగా నిలదొక్కుకుంది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఈ ఇద్దరు పలు కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారు. వాటిలో ఆకాష పూరి ‘రొమాంటిక్’, విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ ఉన్నాయి. వీటిలో ‘ఫైటర్’ చిత్రాన్ని హిందీలో కూడా పెద్ద ఎత్తున విడుదలచేయాలనే ఆలోచనలో ఉన్నారు పూరి, ఛార్మి.

అంతేకాదు హిందీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలనే ఆలోచనలో ఉన్నారు ఈ ఇద్దరు. అందుకే ముంబైలో కార్యకలాపాల కోసం సొంత కార్యాలయాన్ని సిద్దం చేసుకున్నారు. ఈ కార్యాలయం కోసం పూరి తనదైన శైలిలో గట్టిగానే ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ ఆఫీస్ భవనాన్ని సందర్శించిన రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్లో ఉన్న పూరి లావిష్ ఆఫీస్ బిల్డింగ్ కేవ్ కంటే ఈ కొత్త ఆఫీస్ అడ్డా పది రెట్లు గొప్పగా ఉందని అన్నారు.

సంబంధిత సమాచారం :