డే 2 “పుష్ప” నైజాం వసూళ్లు ఎంతోచ్చాయ్ అంటే..!

Published on Dec 19, 2021 11:00 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప”. భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ని వరల్డ్ వైడ్ గా రాబట్టింది. మరి మొదటి రోజు ఈ చిత్రం నైజాం నుంచి అయితే ఆల్ టైం రికార్డు వసూళ్లు కొల్లగొట్టి సాలిడ్ రికార్డ్ నెలకొల్పింది.

ఇక ఇపుడు ఈ సినిమా నైజాం రెండో రోజు కలెక్షన్ డీటెయిల్స్ తెలుస్తున్నాయి. రెండో రోజుకి గాను ఐకాన్ స్టార్ అక్కడ 6.5 కోట్ల షేర్ ని రాబట్టాడట.. ఇక మూడో రోజు కూడా అదిరే వసూళ్లు ఈ చిత్రం అందుకోవడం పక్కా అని చెప్పొచ్చు. మరి ఓవరాల్ గా పుష్ప రాజ్ లెక్క భారీ ఫిగర్ దగ్గరే ఆగే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందివ్వగా మైత్రి మూవీ మేకర్స్ వారు రెండు భాగాలుగా ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :