“పుష్ప”కు వెన్నుపోటు పొడిచేది ఆయనేనా?

Published on Aug 13, 2021 3:00 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “పుష్ప”. పాన్‌ ఇండియన్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుద‌ల చేయ‌నున్నారు. మొదటి భాగం “పుష్ప ది రైజ్” పేరుతో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తగ్గేదే లే అన్నట్టుగా ఈ చిత్ర ప్రమోషన్ జరుగుతుండడంతో సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి.

అయితే బాహుబలి సినిమా మాదిరిగా ఈ సినిమాలో కూడా కట్టప్ప ఉంటాడని, వెన్నంటే ఉండి వెన్నుపోటు పొడిచే పాత్ర అతనిదని ఓ వార్త ఇప్పుడు బయటకొచ్చింది. వెన్నుపోటుతోనే పుష్ప మొదటి భాగం పూర్తవుతుందని, ఎందుకు వెన్నుపోటు పొడిచాడు అనేది రెండో భాగంలో చూపిస్తారని తెలుస్తుంది. అయితే కట్టప్ప పాత్రలో చేస్తున్నది సునీల్ అని, తన కెరీర్‌లో ఎన్నో గుర్తుండిపోయే పాత్ర‌లు చేసిన సునీల్ పుష్ప సినిమాలో మాత్రం చాలా సీరియస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడట. ఇందులో సునీల్ భార్య పాత్రలో అనసూయ భరద్వాజ్ నటిస్తున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :