ఓ రేంజ్ లో డామినేట్ చేస్తున్న పుష్పరాజ్!

Published on Jan 7, 2022 3:00 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ చిత్రం థియేటర్ల లో విజయవంతం గా ప్రదర్శింప బడుతోంది. బాలీవుడ్ లో ఈ చిత్రం తన సత్తా చాటుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అక్కడ 83 మరియు స్పైడర్ మ్యాన్ లాంటి భారీ చిత్రాలు ఉన్నప్పటికీ పుష్పరాజ్ డామినేట్ చేస్తుండటం మామూలు విషయం కాదని చెప్పాలి. తాజాగా ఈ చిత్రం మరో రెండు కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టి, మొత్తం బాలీవుడ్ లో ఇప్పటి వరకూ 72.49 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది.

రష్మీక మందన్న హీరోయిన్ గా ఈ చిత్రం లో నటించగా, సమంత స్పెషల్ సాంగ్ లో ఆడి పాడింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించడం జరిగింది. నేటి నుండి ప్రైమ్ వీడియో లో పుష్ప చిత్రం స్ట్రీమ్ కానుండటంతో ఇక వసూళ్లు కాస్త తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సునీల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, అజయ్ ఘోష్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం రెండవ భాగం పుష్ప ది రూల్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :